+91 95819 05907

సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ: సీఎం రేవంత్ రెడ్డి..

ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామని తాము చెప్పామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయితే.. చెప్పిన గడువు కంటే ముందే రుణమాఫీ ప్రక్రియను అమలు చేస్తున్నామని చెప్పారు. రుణమాఫీ చేస్తామని చెప్తే ఇది అసాధ్యం అని చాలా మంది అన్నారని, ఆర్థిక నిపుణులు కూడా ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని చెప్పారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. చిత్తశుద్ధి ఉంటే అన్ని సాధ్యమేనని తాము నిరూపించామని తెలిపారు. తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ సాహసోపేత హామీ ఇచ్చి నెరవేర్చారని, ఇప్పుడు కూడా అలాగే ఈ సాహసోపేత హామీని నెరవేర్చే బాధ్యత తమపై ఉన్నదని స్పష్టం చేశారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే నెరవేరుస్తుందని నిరూపించే బాధ్యత కాంగ్రెస్ కుటుంబమందరిపై ఉన్నదని రేవంత్ రెడ్డి తెలిపారు.

 

సాయంత్రం 4 గంటల వరకు రూ. 1 లక్ష లోపు పంట రుణాలు మాఫీ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రూ. 7 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతాయని చెప్పారు. ఈ నెలాఖరులోపు లక్షన్నర రుణాలను మాఫీ చేసి వచ్చే నెలలో రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేసి.. రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదని, రైతు ఆత్మగౌరవాన్ని నిలపడానికి రుణమాఫీ నిర్ణయం తీసుకున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏకకాలంలో తాము రుణమాఫీ చేస్తున్నామని గుర్తు చేస్తూ.. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రూ. 31 వేల కోట్ల రుణమాఫీ ఏకకాలంలో జరగలేదని చెప్పారు.

 

రుణమాఫీ మోదీ హామీ కాదు.. ఇది రాహుల్ గాంధీ హామీ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నికర ఆదాయంగా ఉన్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్ రూ. 28 వేల కోట్లు కూడా రైతు రుణమఫీ చేయలేకపోయారని, లక్ష రుణమాఫీ కోసం ఐదేళ్లలో నాలుగు దఫాలుగా రూ. 25 వేల చొప్పున రుణమాఫీ చేశారని విమర్శించారు.

 

ఈ రుణమాఫీ ప్రక్రియపై ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తించేలా బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం విజయవంతంగా ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ఏ రైతూ నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి ఈ నిర్ణయాన్ని తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

 

ప్రజా భవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు మంత్రులు మాట్లాడారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.

 

మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత కరెంట్ గురించి, ఆరోగ్య శ్రీ పథకం, ఇందిరమ్మ ఇళ్ల గురించి ప్రజలు ఇప్పటికీ చర్చించుకుంటారని సీఎం గుర్తు చేశారు. రైతు బంధు గురించి రైతులు 20 సంవత్సరాలు చెప్పుకునే విధంగా ప్రక్రియ సాగాలని సూచించారు. రుణమాఫీ పై జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు సభ్యులు రుణమాఫీపై నేషనల్ మీడియాలో చెప్పాలని సూచించారు.

 

‘మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించండి. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించండి. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా ప్రజలకు చెప్పండి. రేపు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కూడలి నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలి. ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఎక్కడికక్కడ పండుగ వాతావరణంలో సంబురాలు జరుపుకోవాలి. ఏడు నెలల్లో మన ప్రభుత్వం సంక్షేమానికి రూ. 30వేల కోట్లు ఖర్చు చేసింది’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద 62 కోట్ల మంది లబ్ది పొందుతున్నారని, రూ. 500కే సిలిండర్ అందించడానికి రూ. 200 కోట్లు ఖర్చు చేశామని సీఎం వివరించారు. గృహ జ్యోతి 200 యూనిట్ల లబ్ది 46 లక్షల గృహాలకు అందుతున్నదని తెలిపారు. రైతు భీమా కింద రూ. 734 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !