+91 95819 05907

ఆందోళన వద్దు.. అందరికి రుణమాఫీ..

ఆగస్టు నెల దాటకుండనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.  సాయంత్రం రూ. 1 లక్షలోపు రుణాలు మాఫీ అవుతాయని, నెలాఖరు వరకు లక్షన్నర రుణాలను మాఫీ చేస్తామని వివరించారు. వచ్చే నెలలో రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. రుణమాఫీ విషయంలో రుణాలు తీసుకున్న రైతులు ఆందోళన చెందవద్దని, అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. రేషన్ కార్డులేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తామని, ఎవరినీ వదలబోమని, మాట అనే అవకాశాన్ని ఎవరికీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఈ రుణమాఫీ కోసం నిద్రలేని రాత్రులు గడిపామని చెప్పారు. రూపాయి రూపాయి కూడబెట్టి రుణమాఫీ చేస్తున్నామని వివరించారు.

 

మిగులు బడ్జెట్‌లో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం లక్ష రూపాయాల రుణమాఫీ కోసం రూ. 25 వేల చొప్పున నాలుగు దఫాలుగా విడుదల చేసి పూర్తి చేసిందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి గుర్తు చేశారు. ఏడు లక్షల కోట్ల అప్పులతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నెలల వ్యవధిలోనే రూ. 2 లక్షల రుణమాఫీని చేపడుతున్నదని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఐదు హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. అనుకున్న స్థాయిలో ఈ పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో ప్రచారం జరగడం లేదని వివరించారు.

 

పార్లమెంటు ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తే అంతా ఆశ్చర్యపోయారని భట్టి గుర్తు చేశారు. ఓట్ల కోసమే సీఎం హామీలు ఇస్తున్నారని, ఎన్నికల సవాల్ అని అనుకున్నారని తెలిపారు. కానీ, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రూపాయి రూపాయి పోగు చేసి రుణమాఫీని అమలు చేయబోతున్నామని తెలిపారు.

 

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని రైతులకు, ప్రజలకు వివరించి వారి హృదయాలు గెలువాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూతు, ప్రతి ఓటర్ దగ్గరకు కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని, తల ఎత్తుకుని ఎక్కడా తగ్గకుండా ప్రచారం చేయండని చెప్పారు. ఇది కాంగ్రెస్ నేతలు అందరికీ ఉపయోగపడే కార్యక్రమం అని వివరించారు.

 

ప్రజాభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులతో సీఎం, డిప్యూటీ సీఎంలు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. రేపు సాయంత్రం 4 గంటలకు రూ. 1 లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని వివరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !