విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై కొత్త ఛైర్మన్‌ను రేవంత్ రెడ్డి సర్కార్ నియమించనుంది. చాలామంది మాజీ న్యాయమూర్తులు ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ఉన్నట్లు సమాచారం. నేడు గానీ రేపుగానీ కొత్త ఛైర్మన్‌ను ఎంపిక చేయనుంది ప్రభుత్వం.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై నియమించిన కమిషన్ ఛైర్మన్ పదవి నుంచి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి తప్పుకున్నారు. దీంతో ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న దానిపై గురువారం ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు లేదా ప్రధాన న్యాయమూర్తుల్లో ఒకరికి విచారణ బాధ్యతలు అప్పగించాలనే యోచనలో రేవంత్ సర్కార్ ఉంది. ఈ ప్రక్రియను ఐదురోజుల్లోపు పూర్తి చేయాలని భావిస్తోంది.
ఇందులో భాగంగా కమిషన్‌కు కొత్త ఛైర్మన్ కోసం హైకోర్టు రిజిస్ట్రార్‌కు లేక రాయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. పాత కమిషన్ ఇప్పటికే పలు ప్రక్రియలు పూర్తి చేసింది. ఈ నెలాఖరున కమిషన్ గడువు ముగియ నుంది. ఈ నేపథ్యంలో కమిషన్ ఛైర్మన్ తప్పుకోవడంతో విచారణ మళ్లీ మొదటికి వచ్చింది.