నేటి గదర్ న్యూస్ , జులై 18 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
కూసుమంచి మండలం మునిగేపల్లి గ్రామంలోని ఓ రైతు పత్తి చెల్లో చిరుతపులి సంచరించినట్టు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన రామా శ్రీను అనే రైతు పత్తి చేల్లో చిరుత పాద ముద్రలు పోలిన ఆకృతిలో పాద ముద్రలు ఉండడంతో భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఆ పాద ముద్రలు చిరుత పులివేనా లేదా మరేదైనా ఇతర జంతువుల పాద ముద్రాల తెలియాల్సి వుంది. చుట్టూ ఉన్నది మైదాన ప్రాంతం కావడంతో ఏ జంతువుకు సంబంధించిన పాద ముద్రలు అనేవి అటవీ అధికారులు దృవీకరించే వరకు గ్రామస్తులకు కొంత ఆందోళనే.. ఇప్పటికే స్థానికులు అటవీ శాఖ అధికారులకు విషయం చెరవేసినట్టు సమాచారం . అటవీ శాఖ అధికారులు ఆ పాద ముద్రలను పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుంది.. అప్పటివరకు గ్రామస్తులు ఎవరు ఆ ప్రదేశం వైపు వెళ్ళకుంటేనే మేలు అని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.









