రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఆగష్టు 2:- మెదక్ జిల్లా అర్ వెంకటాపూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు పుర్ర రామస్వామి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును
శిరసావహిస్తూ శుక్రవారం గ్రామంలో అంబేద్కర్ సంఘం సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలుగా పోరాడిన ఫలితంగానే ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టులో ఆమోదం తెలిపినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.మాల మాదిగ 59 ఉప కులాలకు న్యాయం చేసిన ఘనత కేంద్రానికే దక్కిందన్నారు.ఈ కార్యక్రమంలో బండారి కిషన్ కొమ్మ గళ్ళ కృష్ణ బండారి సందీప్ ప్రభుదాస్ స్వామి వినోద్ రాజు రవి సిద్ధరాములు ప్రవీణ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Post Views: 102