★ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్( ప్రజాపంథా) పినపాక మండల కార్యదర్శి శెట్టిపెళ్లి. నాగేశ్వరరావు.
నేటి గదర్ న్యూస్,పినపాక:
ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్( ప్రజాపంథా) పినపాక మండల కార్యదర్శి శెట్టిపెళ్లి. నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పినపాక తహసిల్దార్ గారికి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలలో కొత్త రేషన్ కార్డులు, ఇండ్ల మంజూరు, మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇచ్చుట, వృద్ధాప్య పెన్షన్లు నెలకు 4000 వికలాంగుల పెన్షన్లు నెలకు 6000 చెల్లించుట, వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000 ఇచ్చుట తదితర హామీలు నేటికీ అమలు చేయలేదన్నారు. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడం వలన ఆరోగ్యశ్రీ లో వైద్య సదుపాయం పొందుట, రైతు రుణమాఫీ పొందడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అన్నారు. ఎంతో మంది పేదలకు సరైన ఇండ్లు, ఇంటి స్థలాలు లేక వర్షాలకు ఇబ్బంది పడుతూ జీవిస్తున్నారు అన్నారు. వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 10 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని, ఇంటి స్థలాలు లేని పేదలకు ఇంటి స్థలాలు చూపించాలని, కొత్త రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని, మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం నెలకు 2500 రూపాయలు చెల్లించాలని, వృద్ధులకు, వికలాంగులకు పెంచుతామన్న పెన్షన్లు వెంటనే పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వీరనారాయణ చారి, అనసూర్య, వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.