నేటి గదర్ న్యూస్ సెప్టెంబర్ 7:వైరా నియోజవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు.
కారేపల్లి: బాధిత కుటుంబానికి గౌసుద్దీన్ ఆపన్న హస్తం అందించారు . వారం రోజులు గా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కారేపల్లి మండలం భరత్ నగర్ కాలనీకి చెందిన చలివేంద్రం లక్ష్మినారాయణ ఇల్లు కూలిపోయింది. దాంతో ఆ కుటుంబం నిరాశ్రయులయ్యారు .ఈ విషయం తెలుసుకున్న బి ఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకులు షేక్ గౌసు ద్దీన్ బాధితులకు అండగా నేనున్నానంటూ శుక్రవారం వారి వద్దకు వెళ్లి , 3000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఆపద సమయంలో తమను ఆదుకున్న జిల్లా మైనార్టీ నాయకులు షేక్ గౌసుద్దీన్ మానవత్వం పరిమళించిన మంచి మనసు కు ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖలీలుల్లా ఖాన్, చెవుల అనిల్ కుమార్, ఉదయ్ నరేష్, అబ్దుల్వాయిబ్, కాంతయ్య, సాయమ్మ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 37