రంగు మారిన మిషన్ భగీరథ నీరు. వరద నీరు రావడంతో కలుషితం.
నేటి గదర్ న్యూస్ సెప్టెంబర్ 7: వైరా ప్రతినిధి.
వైరా :గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి వైరా రిజర్వాయర్ కి వరద నీరు రావడంతో వైరా బోడపుడి సుజల స్రవంతి పథకం కింద ఉన్న వైరా మండలము. మరియు వైరా మున్సిపాలిటీ తల్లాడ, కొణిజర్ల మండలంలో గ్రామస్తులకు మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ ఏ ఈ చిరంజీవి ఒక ప్రకటనలో, వైరా రిజర్వాయర్ కి వరద నీరు రావడంతో,నీరు రంగు మారడంతో ఈ నీరు నిత్య అవసరాలకు మాత్రమే వాడుకోగలరు అత్యవసర పరిస్థితుల్లో తాగవలెను అంటే వేడి చేసుకుని చల్లార్చి తాగగలరు అని తెలియజేసినారు. మరియు సోమవారం,మంగళవారము ప్లాంటు క్లీనింగ్ చేయడం కోసము ప్లాంట్ ఆపుతున్నాము. నీటి సరఫరా బంద్ అవుతుంది. ఈ రెండు రోజులు ప్రజలు సహకరించగలరని కోరినారు.
Post Views: 118