నేటి గదర్ న్యూస్ , సెప్టెంబర్ 7 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు)
పాలేరు బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్ర గాయాలపాలయ్యారు… వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం- సూర్యాపేట ప్రధాన రహదారి మీద ఎదురెదురుగా వస్తున్న బొలెరో ,ద్విచక్ర వాహనం డీకొన్న ఘటనలో పాలేరు గ్రామానికి చెందిన శీలం నారాయణ (30) ఎలిశెట్టి వినోద్ (31) తీవ్ర గాయాలపాలయ్యారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైవే కోతకు గురి కావడంతో వాహనాలను ఒకవైపు మల్లించడంతో ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు డీ కొన్నట్టు సమాచారం… వెంటనే చికిత్స కోసం 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
Post Views: 829