+91 95819 05907

మంజీరా విద్యాలయంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) అక్టోబర్ 1:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని స్థానిక మంజీరా విద్యాలయంలో నేడు ఘనంగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడం జరిగింది.ప్రకృతిని ఆరాధించే పండగ బతుకమ్మ పండగ పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు, సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ.స్త్రీలు బొడ్డెమ్మను దశమి రోజు నుంచి ఆరంభిస్తారు.మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మలను బతుకమ్మతో పాటు నిమజ్జనం చేస్తారు.బృహతమ్మ నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకుగాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలో పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు.తెలంగాణ వాసులు అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా దాదాపు వేయి సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణవాసులు జరుపుకుంటున్నారు. ఆడపిల్లలు అందరూ ఒకచోట చేరి తీరొక పూలతో అందంగా పేర్చేది బతుకమ్మ.మొదటి రోజు అమావాస్య రోజు జరుపుకునే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మని, రెండవ రోజు అటుకుల బతుకమ్మని,మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మని, నాలుగవ రోజు నాన్న బియ్యం బతుకమ్మని,ఐదవరోజు అట్ల బతుకమ్మ ,ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అని,ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ అని,ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ అని,చివరి తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మ అని సద్దులు కలిపి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది.ఊరువాడ అంతా కలిసి ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీంతో పాటు ఈరోజు పాఠశాలలో ఎల్లో కలర్ డే నిర్వహించడం జరిగింది.పసుపు రంగు అనేది హిందూ సంప్రదాయ ప్రకారం శుభప్రదాయకం.మన నిత్య జీవితంలో కాంతిని ఇచ్చేటటువంటి సూర్యుడు పసుపు రంగులోనే మామిడిపండు, అరటిపండు ,మొక్కజొన్న పైనాపిల్ వీటి వలన ఎన్నో విటమిన్లు మనకు అందుతాయి.నిత్యం మనం ఉపయోగించేటటువంటి పసుపు వంటలలో ఉపయోగించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆంటీబయాటిక్ గా పనిచేస్తుంది.వీటి గురించి పిల్లలకి చక్కగా వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు సంప్రదాయ దుస్తులలో వచ్చి బతుకమ్మలను పేర్చడం జరిగింది.పిల్లలందరూ బతుకమ్మలు ,కోలాటాలు ఆడి చివరికి బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం వలన భావితరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను పండుగల యొక్క గొప్పతనాలను వాటి విశిష్టతను తెలియజేయడమే లక్ష్యంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సురేష్, కరస్పాండెంట్ జితేందర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు వాసవి,మీనా,భావన మౌనిక పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నవోదయ పాఠశాల. తాత్కాలిక భవనాన్ని పరిశీలించిన డీఈవో

*తాత్కాలిక భవనాన్ని పరిశీలించిన డీఈవో వెంకటెశ్వర చారి* నేటి గదర్ కరకగూడెం: కరకగూడెం జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలోని కలిగ ఉన్న పాఠశాల భవనాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చెయ్యనున్న నవోదయ పాఠశాల ప్రాంతాన్ని జిల్లా

Read More »

గ్రూప్-1 ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది

గ్రూప్-1పై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.* వివిధ రకాల అభ్యంతరాలతో అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. *నేడు(సోమవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం వాటిని కొట్టివేసింది.* దీంతో ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు

Read More »

మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాల తుది వివరాలు విడుదల :ఎంపీడీవో సునీల్ కుమార్

పినపాక, నేటి గదర్ న్యూస్ : పినపాక మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాల తుది జాబితా విడుదల చేశామని పినపాక ఎంపీడీవో సునీల్ కుమార్ తెలియజేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆ జాబితా

Read More »

జంతువుల సంరక్షణకు అండర్ పాసులు నిర్మించాలి రేంజ్ అధికారి విద్యాసాగర్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అటవీ రేంజ్ అధికారి కార్యాలయంలో సోమవారం నాడు స్థానిక విలేకర్లతో రామాయంపేట అటవీ రేంజ్ అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ

Read More »

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసిన మైనంపల్లి హనుమంతరావు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శ్రీ పద్మావతి గోదాదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పుష్కర బ్రహోత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి.ఈ సందర్బంగా శ్రీ వెంకటేశ్వర

Read More »

లక్ష డప్పులు-వెయ్యి గొంతుల కార్యక్రమం గోడపత్రిక ఆవిష్కరణ

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు-వెయ్యిగొంతులు అనే కార్యక్రమానికి సంబంధించి సోమవారం మెదక్

Read More »

 Don't Miss this News !