రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) అక్టోబర్ 1:- మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు,బతుకమ్మ సంబరాలు మంగళవారం రోజు ఘనంగా జరుపుకున్నారు.మొదటగా పాఠశాలలో విద్యార్థులు బతుకమ్మలను తంగేడు పూలతో పేర్చి పాఠశాల ఆవరణలో పెట్టి బతుకమ్మల చుట్టు తిరుగుతూ విద్యార్థులు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆట పాటలు పాడారు.అనంతరం గ్రామ సమీపంలో ఉన్న చెరువు వద్ద బతుకమ్మలను విద్యార్థులు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్ కుమార్,ఉపాధ్యాయులు మోహన్,మమత, నవీన్ రత్నాకర్, జ్యోతిలక్ష్మి పాల్గొన్నారు.
Post Views: 49