నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 19:
నేటి సమాజంలో విలేకరులు విలువలతో కూడిన జర్నలిజం చేయాలని ములుగు డిఎస్పి రవీందర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ములుగు డిఎస్పి రవీందర్ ను ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బానోతు వెంకన్న, గౌరవ అధ్యక్షుడు భూక్య సునీల్ మర్యాదపూర్వకంగా కలిసీ, పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా డిఎస్పి రవీందర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేయాలని, వార్త కథనాలు ప్రచురించే సమయంలో ఒకటికి రెండుసార్లు విషయాలను తెలుసుకొని అధికారులను సంప్రదించి వార్తలను ప్రచురించాలని సూచించారు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సమస్యల సాధనకు ప్రభుత్వానికి తోడ్పాటును అందించాలని అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి జర్నలిజం వృత్తికి పన్నె తెచ్చేలా పనిచేయాలని సూచించారు. వారితో పాటు టియుడబ్ల్యూజే ఐజేయు దాడుల నివారణ కమిటీ అధ్యక్షుడు జాలిగాపు శ్రీనివాస్, ఐజేయు నాయకులు బిక్కనూరు సుమన్ ఉన్నారు.