నేటి గద్దర్ కరకగూడెం:మండల కేంద్రంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న, స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.
అనంతరం అయన మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి ఏకైక మహిళ ప్రధానమంత్రి,ఉక్కు మహిళ ఇందిరా గాంధీ అని ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా మూడు పర్యాయాలు 1980లో నాలుగో పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేశారని అన్నారు.భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు ఏకైక కుమార్తె 1964 సంవత్సరంలో తండ్రి మరణం తర్వాత రాజ్యసభ కి ఇందిరా గాంధీ ఎన్నిక అయ్యారు అని అన్నారు.
ఆనాడు ఇందిరా గాంధీ గరీబ్ హటావో అనే నినాదంతో తన ప్రచారాన్ని నిర్వహించి 43 రోజులపాటు దేశమంత పర్యటించారని తెలిపారు.
1966-01-24 న భారత ప్రధానిగా ఎన్నికై అతి చిన్న వయసులో తొలి మహిళ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని 1966 రాజ్యసభ ద్వారా ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తులలో ఇందిరాగాంధీ మొట్టమొదటీ.జవహర్లాల్ నెహ్రూ తర్వాత అత్యధిక కాలం పాటు ప్రధాన మంత్రి పదవి చేపట్టి రెండవ స్థానంలో నిలిచి దేశం కోసం ముఖ్యంగా మహిళల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి, చివరికి దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన మహా యోధురాలు మన ఇందిరా గాంధీ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో
మాజీ ఎంపిటిసి బిజ్జా రామనాథం, మాజీ ఉపసర్పంచ్ కొమరం వెంకటేశ్వర్లు,మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల నాయకులు అత్తే సారయ్య స్వామి, బరపటి వెంకన్న, పునెం బుచ్చయ్య,గాంధర్ల రామనాధం,, దొంతు మల్లయ్య స్వామి , ఎల్లబోయిన బుచ్చయ్య,తోలెం కృష్ణ ,తొలెం అప్పారావు, వగలబోయిన శ్రీను, జిమ్మిడి నవీన్ గూటం శేఖర్, మహిళలు యువకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.