చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
చర్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతదేశ తొలి మహిళ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ 107వ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించిన చర్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవం గా జరుపుకుంటుందని తెలిపారు. దేశంలోని పేద ప్రజల కోసం కానా మకాన్ (భోజనము, ఇల్లు) ప్రతి పేదవారికి అందించిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందన్నారు. వ్యవసాయ భూములను పేదవారికి పంచిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ దక్కిందన్నారు. బ్యాంకులను జాతీయం చేయడం వలన ప్రజలకు మరింత చేరువ చేశారన్నారు. నెహ్రూ నుంచి అందిపుచ్చుకున్న నాయకత్వ పటిమతో ఉక్కు మహిళగా ఇందిరా గాంధీ దేశ ప్రజలకు మేలు చేసిన ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారని.ఈ సందర్భంగా కొనియాడారు.ఈ కార్యక్రమంలో డివిజన్ రైతు కాంగ్రెస్ నాయకులు ఇందల బుచ్చిబాబు, చర్ల మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కారంపూడి సాల్మన్ రాజు, తోటమల్ల వరప్రసాద్, ఇర్పాశ్రీనివాసరావు, కణితి శ్రీనివాసరావు,గుడిమెట్ల సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.









