+91 95819 05907

వలస గిరిజనేతరులకు ఏజెన్సీ లో ఎటువంటి సౌకర్యాలు కల్పించొద్దు.!

నేటి గదర్ చర్ల ప్రతినిధి:వరప్రసాద్

జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూణెం సాయి దొర

వలస గిరిజనేతరులకు ఇంటి పన్నులు మంజూరు చేసిన పంచాయితీ కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలి…

ఆదివాసి యువత ఉద్యమాల్లో పాల్గొనాలని జిఎస్పి పిలుపు…

వెంకటాపురం మండల వ్యాప్తంగా ఆదివాసీ గ్రామంలో గొండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలోసుడిగాలి పర్యటన చేశారు, ఈ సందర్భంగా రాచపల్లి గ్రామాల్లో ఆదివాసీ సమస్యల పై సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ సమావేశంలో జిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర పాల్గొని ప్రసంగించారు.ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ వలస గిరిజనేతరులు విచ్చల విడిగా వస్తున్నారని, వారిని తక్షణమే మైదాన మైదాన ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,గో బ్యాక్ నాన్ ట్రైబల్ అంటూ సాయి దొర నినాదం ఇచ్చారు.వెంకటాపురం మండలానికి విచ్చలవిడిగా వలస గిరిజనేతరులు వచ్చి 1/70 చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వ భూములు దౌర్జన్యంగా ఆక్రమించుకొని,ఏజెన్సీ చట్టానికి విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు,అక్రమ వ్యాపారాలు,చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు .అధికారులు కూడా వారికి వత్తాసు పలుకుతూ వాళ్ళ జీవన విధానానికి తోడ్పడే విధంగా ఏజెన్సీ చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని. గిరిజనేతరులు ఇచ్చే మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం తూలుతుందని ఆయన ఆరోపించారు. 1/70,పీసా,చట్టాలను ఉల్లంఘించి గ్రామపంచాయతీ నుండి వలసలు అక్రమంగా ఇంటి పన్నులు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారని, దీనికి కేవలం పంచాయతీ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇలాంటి అధికారులను మైదాన ప్రాంతాలకు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు.వలస గిరిజనేతరుల ఇంటి పన్నులను రద్దు చేసి వలస గిరిజ నేతరులకు ఇంటి పన్నులు మంజూరు చేస్తున్న పంచాయితీ అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.అలాగే షెడ్యూల్ ఏరియాలో వలస గిరిజనేతరుల వలన ఆదివాసీలు మైనార్టీలో పడిపోయే ప్రమాదం ఉందని ఏజెన్సీ ప్రాంతానికి వలస వచ్చిన గిరిజనేతరుల విద్యుత్ మీటర్లు మరియు రేషన్ కార్డులు మరియు ఆధార్ కార్డులను తక్షణమే రద్దు చేయాలని కోరారు.ఆదివాసి యువకులు ఆదివాసీ చట్టాల కోసం జీవోల కోసం ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని,ముందు ముందు ఆదివాసి మనుగడ కోసం ఉద్యమాలను బలోపేతం చేయాలని,అందుకు యువత ఉద్యమాల్లో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో గ్రామ పెద్దలు ఆదినారాయణ,చంటి చెరుకుల,లక్ష్మయ్య చెరుకుల,చెరుకుల సాయిబాబు,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !