హనుమకొండ జిల్లా
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ ఎం) కు చెందిన ఎన్. హెచ్. ఎం.అల్ క్యాడర్స్ ఉద్యోగులకు క్యాడర్స్ ఫిక్సేషన్ చేసి, బేసిక్ వేతనం అమలు చేయాలని ఎన్ హెచ్ ఎం ఆల్ క్యాడర్స్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా పత్రిక ప్రకటనలో కోరారు. నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ వైద్యులను రెగ్యులర్ చేసిన విధంగానే ఉద్యోగులందరికీ రెగ్యులర్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో రోజు రోజుకు పని భారం పెరుగుతుందని ప్రభుత్వం వెంటనే తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. జనాభాకు అనుకూలం ఒక వైద్య పోస్టులతో పాటు అన్ని క్యాడర్ పోస్టులను పెంచి పని భారాన్ని తగ్గించాలని ఆయన కోరారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్ హెచ్ ఎం ఆల్. క్యాడర్స్ ఉద్యోగులకు క్యాడర్స్ ఫిక్స్ చేసి, బేసిక్ వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ హెచ్ ఎం అల్ క్యాడర్స్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ ఆల్ క్యాడర్స్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని , ఉద్యోగితోపాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా మూలవేతనం చెల్లించాలని, వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న ఖాళీలలో ఎస్.హెచ్.ఎం. ఉద్యోగులను క్యాడర్ వైస్ గా విలీనం చేయాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, ప్రతినెల 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని,సంవత్సరానికి ప్రతి ఒక్కరికి 35 క్యాజువల్ లీవ్స్ మంజూరు చేయాలని, ఎన్ హెచ్ ఎం ఉద్యోగి మరణించినట్లయితే వారి కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వాలని, 65 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ ప్రకటించి వారికి నెలకు పెన్షన్ 25 వేల రూపాయలు ఇవ్వాలి, దేశంలో పలు రాష్ట్రాలలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేశారు రెగ్యులరైజేషన్ చేసిన రాష్ట్ర లు హర్యానా, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ , మహారాష్ట్ర ఒడిస్సా, చేశారు. అదే మాదిరిగా అల్ క్యాడర్ ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని హెచ్ఎం అల్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు…









