+91 95819 05907

13 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన పేరును ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలంలో నమోదు చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు

బీహార్‌కు చెందిన 13 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన పేరును ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలంలో నమోదు చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలో పాల్గొన్న అతని పేరు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వయసులో ఇంతటి ఘనత చూపించిన అతనిపై క్రికెట్ ప్రేమికుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది.వైభవ్ క్రికెట్ ప్రయాణం ప్రత్యేకమైనది. 2011లో బీహార్‌లోని తాజ్ పుర్ గ్రామంలో జన్మించిన అతను నాలుగేళ్ల వయసులోనే బ్యాట్ పట్టుకున్నాడు. తన కొడుకు క్రికెట్‌లో ప్రత్యేక ప్రతిభను గమనించిన తండ్రి సంజీవ్ సూర్యవంశీ, అతనికి శిక్షణ కోసం ప్రత్యేక మైదానం ఏర్పాటు చేశారు. ఎనిమిదేళ్లకే సమస్తిపూర్ క్రికెట్ అకాడమీలో చేర్పించి, శిక్షణ పొందేలా చూసుకున్నారు. రెండు సంవత్సరాల్లోనే వైభవ్ అండర్-16 జట్టులో చోటు సంపాదించాడు, అదే సమయంలో అతని వయసు కేవలం పదేళ్లు మాత్రమే కావడం విశేషం.

లెఫ్ట్ హ్యాండర్‌గా వైభవ్ తన ఆటలో దూకుడు చూపిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ప్రతిభ చూపిస్తున్న అతను, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఈ ఏడాది ఆరంగేట్రం చేసి ఐదు మ్యాచ్‌లు ఆడాడు. ముఖ్యంగా ఓపెనింగ్‌లో అతని ధాటిగా ఆడే విధానం ప్రత్యేక ఆకర్షణ. బౌండరీల కోసం ఎదురుచూడకుండా ఫీల్డింగ్ సెటప్‌ను తనకు అనుకూలంగా మార్చుకునే కసితో ఆడే అతని ఆటతీరును చూసి ఎవరైనా ఆశ్చర్యపోతారు.ఐపీఎల్ మెగా వేలంలో వైభవ్ పేరును చేర్చడంతో క్రికెట్ ప్రపంచంలో చర్చ మొదలైంది. అతన్ని ఎవరైనా ఫ్రాంచైజీ ఎంపిక చేస్తే, అది సంచలనానికి దారి తీస్తుందని భావిస్తున్నారు. 16 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన తర్వాత ఇలాంటి సంచలనం ఇప్పుడు వైభవ్ రూపంలో మళ్లీ పునరావృతమవుతుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఈ వయసులోనే ఇంతటి ఆత్మవిశ్వాసంతో ఉన్న వైభవ్ ప్రతిభను గుర్తించి ఐపీఎల్‌లోకి తీసుకుంటే, భారత క్రికెట్‌లో ఒక ప్రత్యేక అధ్యాయం ప్రారంభమైనట్టే. అతని విజయయాత్రను అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

all the best
#vaibhavsuryavansi

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !