★డాక్టర్ కొమరం మహేందర్
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు ఆదేశాల మేరకు, వైద్యాధికారి కొమరం మహేంద్ర ఆధ్వర్యంలో
యాంటీ మైక్రో బి ఎల్ రెసిస్టెన్స్
గూర్చి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలు
అధిక మోతాదులో యాంటీబయోటిక్స్ వాడకూడదని, అధిక మోతాదులో వాడితే రోగ నిరోధక శక్తి తగ్గిపోయి పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున యాంటీబయాటిక్స్ తీసుకునే వారు డాక్టర్ సలహాలు, సూచనలు తీసుకోవాలని డాక్టర్ కొమరం మహేందర్ తెలిపారు. ప్రధానంగా గర్భిణి స్త్రీలు యాంటీబయాటిక్స్ వాడకుండా ఉండడం మంచిదని వారన్నారు. సీజనల్ వ్యాధులు, జలుబు, దగ్గు వంటి చిన్నచిన్న ఇన్ఫెక్షన్స్ కి టాబ్లెట్స్ వాడకూడదని చేతులు శుభ్రపరచుకోవడం వల్ల వ్యాధులకు దూరంగా ఉండవచ్చని దాని ద్వారా టాబ్లెట్ తీసుకునే అవసరం రాదని అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పల్లె దవాఖాన వైద్యాధికారి
గ్యానస. హెల్త్ సూపర్వైజర్స్ వెంకటరమణ. కోటిరెడ్డి. ఆశ కార్యకర్తలు. శాంత కుమారి. దేవి. లక్ష్మి
నారాయణమ్మ. ఒకేషనల్ కోర్స్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.