సరూర్నగర్ స్టేషన్ పరిధిలో నమోదైన ఫోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష విధింపు
★బాధితురాలికి రూ.5,00,000/- పరిహారం అందించబడింది.
నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:
సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, ఒక మైనర్ బాలికను ప్రేమ పేరుతో మభ్యపెట్టి, అపహరించి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన Cr. NO 814/2018 కేసులో నిందితుడు వరికుప్పల మహేష్ S/o యాదయ్య, వయస్సు 23 సంవత్సరాలు వృత్తి: బైక్ మెకానిక్ R/o విష్ణుపురి కాలనీ, చంపాపేట్ సరూర్ నగర్, రంగా రెడ్డి జిల్లా, N/o రాంనగర్ పోలేపల్లి (v), చింతపల్లి (m) నల్గొండ జిల్లా వాసికి పోక్సో చట్టం ప్రకారం 20 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో U/S 366, 376(2)(n) IPC & SEC 5 R/W 6 SC NO 503/2019, అత్యాచారం మరియు పోక్సో చట్టం ప్రకారం రంగారెడ్డి జిల్లా, ఎల్.బి.నగర్లోని గౌరవ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి గారు ఈ రోజు అనగా 31/12/2024న నిందితుడిని దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడికి 20 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష మరియు రూ.25,000/- జరిమానా విధించబడింది మరియు బాధితురాలికి రూ.5,00,000/- పరిహారం అందించబడింది. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి సునీత గారు వాదనలు వినిపించారు.