+91 95819 05907

చలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో జనవరి 10న డి.జే.ఎఫ్‌ జర్నలిస్టుల మహాసభ

డీ.జే.ఎఫ్ స్టేట్ మీడియా సెక్రటరీ సీనియర్ జర్నలిస్ట్ సి.హెచ్ విజయ్ కుమార్

మెదక్ రూరల్ (రవి) నేటి గద్దర్ జనవరి 07.

ప్రజాహితమే లక్ష్యంగా పనిచేసేవారంతా జర్నలిస్టులేనని, అక్షర యోధులకు చిన్న పెద్ద తారమ్యం లేదని చాటిచెబుతూ జర్నలిస్టుల హక్కుల సాధనే ధ్యేయంగా ఏర్పడిన ప్రగతి శీల పాత్రికేయ ఐక్య కూటమే డి.జే.ఎఫ్‌ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ పనిచేసే చిన్న, మధ్యశ్రేణి, పెద్ద పత్రికలతోపాటు య్యూట్యూబ్‌ న్యూస్‌ ఛానెళ్లు, వెబ్‌, డిజిటల్‌ మీడియా ప్రతినిధులంతా జర్నలిస్టులుగా గుర్తించి వారందరికీ అన్ని ప్రభుత్వ రాయితీలు, సంక్షేమ పథకాలు అందించాలని డిజెఎఫ్‌ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది. అక్రిడిటేషన్‌తో సంబంధం లేకుండా డిజిటల్‌ , వెబ్‌ మీడియాలతోపాటు చిన్న, మధ్యశ్రేణి పత్రికల్లో పనిచేసే అక్షర సైనికులందరికీ అన్నిరకాల ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించే ఆశయంతో డిజెఎఫ్‌ జాతీయ స్థాయిలో అక్షర పోరాటం చేస్తోంది. ఎందరో నిఖార్సయిన పాత్రికేయులు, సామాజిక స్పృహ ఉన్న మరెందరో పోరాట యోధుల నేతృత్వంలో డిజెఎఫ్‌ అత్యధిక సభ్యులతో గొప్ప జర్నలిస్టుల పోరాట సంఘంగా జాతీయ కూటమిగా రూపుదిద్దుకున్నది. జర్నలిస్టులకు వృత్తిలో నైపుణ్యం కోసం శిక్షణ, వివిధ రకాల దాడుల నుంచి రక్షణ, పాత్రికేయుల సంక్షేమం అనే మూడు అంశాలు డిజెఎఫ్‌ ప్రధాన అజెండా. జర్నలిస్టుల మధ్య ఎలాంటి తారతమ్యాలు, చిన్నా పెద్ద అనే వివక్షత లేకుండా నీతిని వీడకుండా,నిజాన్ని కప్పిపుచ్చకుండా, స్వామి సేవ చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా ప్రజాస్వామ్య వారధులుగా పనిచేసేవారంతా నిఖార్సయిన పాత్రికేయులేనని ఎలుగెత్తి చాటడమే డిజెఎఫ్‌ జెండా, అజెండా.
డిజెఎఫ్‌ ప్రధాన డిమాండ్స్‌
1.వర్కింగ్‌ జర్నలిస్టులందరికీ ఎలాంటి వివక్షత లేకుండా అక్రిడేషన్‌తో సంబంధం లేకుండా ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలను మంజూరు చేయాలి
2. జర్నలిస్టులందరికి వారి కుటుంబ సభ్యులతోపాటు ఉచిత కార్పోరేట్‌ వైద్యం అందించాలి.
3. జర్నలిస్టుల పిల్లలకు ఉచిత కార్పోరేట్‌ విద్య అందించాలి
4.జర్నలిస్టులకు కుటుంబ సభ్యులతోపాటు ఉచిత రవాణ సౌకర్యం కల్పించాలి
5.పాత్రికేయులందరికీ న్యూస్‌ స్టూడియోలు, ప్రింటింగ్‌ మిషన్లు ఏర్పాటు చేసుకోవడానికి వడ్డీలేని రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు రుణాలను అందించాలి.
6.జర్నలిస్టులు వృత్తిలో భాగంగా మరణించిన పక్షంలో రూ. కోటి రూపాలయ ఎక్స్‌గ్రేషియో చెల్లించాలి.
7. జర్నలిస్టులపై దాడులు చేస్తే 10 యేండ్ల కఠిన కారాగార శిక్ష విధించాలి
8. జర్నలిస్టులకు శాసన మండలిలో సభ్యుడు (ఎంఎల్‌సి) తప్పక ఉండేలా చూడాలి
9.జర్నలిస్టులకు అభివృద్ధి కార్యక్రమాల అమలు విషయంలో అక్రిడిటేషన్‌ అనే నిబంధనను పూర్తిగా ఎత్తివేసి అర్హులైన జర్నలిస్టులందరికీ పథకాలు అమలు చేయాలి
10. జర్నలిస్టుల మీద అందిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేయాలంటే ముగ్గురు సభ్యులతో కూడిన సీనియర్‌ పాత్రికేయులతో కూడిన స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసి వారి అనుమతితో మాత్రమే పోలీసులు కేసులు నమోదు చేయాలి
జనవరి 10న డిజెఎఫ్‌ జర్నలిస్టుల మహాసభ
జర్నలిస్టుల హక్కుల సాధనతోపాటు, పాత్రికేయులకు శిక్షణ, జర్నలిజంలోని మెళకువల కోసం జనవరి 10న కరీంనగర్‌ పట్టణంలో డిజెఎఫ్‌ ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టుల మహాసభను నిర్వహించనున్నట్లు డిజెఎఫ్‌ కేంద్ర, రాష్ట్ర నాయకత్వం తెలిపింది. ఈ సమావేశానికి ఎందరో అతిరథ మహారథులు హాజరయి తమ అమూల్యమైన సందేశాలను అందించనున్నారని డిజెఎఫ్‌ నాయకులు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే డిజెఎఫ్‌కు పాత్రికేయుల నుంచి అమిత ఆదరణ దక్కుతోందని జనవరి10 కరీంనగర్‌ సభకు అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరయి సమావేశాన్ని విజయవంతం చేయాలని జర్నలిస్టులందరినీ పేరుపేరునా డి.జె.ఎఫ్‌ జాతీయ, రాష్ట్ర నాయకులను ఆహ్వానిస్తున్నాము.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !