చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
గురుదేవ్ విద్యాలయంలో హై స్కూల్ విద్యార్థినుల కు ,డా. పూజ (బి.హెచ్. ఎం.ఎస్ ఆయుషి హోమియో) మరియు డా.హారిక ( సి.ఎ.ఎస్) అవగాహనా కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమం లో డాక్టర్లు హై స్కూల్ విద్యార్థినుల తో మాట్లాడుతూ పౌష్టికాహారం తీసుకోవడం గురించి, వ్యక్తిగత పరిశుభ్రత కు తీసుకోవలసిన జాగ్రత్తలు, పీరియడ్స్ సమయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని, సరియైన మంచినీరు తాగకపోవడం వల్ల ఏర్పడే సమస్యలు, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల భవిష్యత్ లో వచ్చే అనర్థాలు ఎంతో వివరం గా తెలియజేశారు. విద్యార్థినులు అడిగిన సందేహాలను నివృత్తి చేసారు. ప్రధానోపాధ్యాయులు హెచ్. జి. వి. ప్రసాద్ గారు మాట్లాడుతూ తమ పాఠశాలకు వచ్చి పిల్లలకు ఆరోగ్య పరిరక్షణ పై అవగాహన కల్పించి నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Post Views: 194









