+91 95819 05907

బిజెపి కార్యాలయం, గాంధీభవన్ పై జరిగిన దాడులను ఉపేక్షించం :డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాదులో గాంధీ భవన్,  బిజెపి కార్యాలయాలపై జరిగిన దాడులపై ఎర్రుపాలెం మండలం వెంకటాపురం గ్రామం నుంచి స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

నేటి గదర్ న్యూస్ జనవరి 07: ఎర్రుపాలెం ప్రతినిధి సగ్గుర్తి ముత్యాలరావు

హైందవ సంస్కృతి, భారతీయ సంస్కృతి గురించి బాగా గొప్పలు మాట్లాడే బిజెపి నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులు, ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రమేష్ బిదోరి గౌరవ పార్లమెంటు సభ్యురాలు ప్రియాంక గాంధీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడిన మాటలను భారతదేశంలో స్త్రీల పైన గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు ఖండించాలి.

బిజెపి కార్యాలయం, గాంధీభవన్ పై జరిగిన దాడులను ఉపేక్షించం.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను పటిష్టంగా అమలు చేస్తాం

ఎవరు ఎవరిపై దాడులు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అసెంబ్లీలో కూడా ఇదే విషయాన్ని చెప్పాం.

బిజెపి కార్యాలయంపై యువజన కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని ఉప ముఖ్యమంత్రిగా నేను, పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు

బిజెపి కార్యాలయంపై యువజన కాంగ్రెస్ నాయకులు కొంతమంది దాడి చేసిన విషయం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలియదు వారితో నేను ఇప్పుడే ఫోన్ లో మాట్లాడాను.

కొంతమంది బిజెపి నాయకులు దాడి గురించి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు ముందుగా మీ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పండి. సంస్కృతి, సంస్కారం నేర్పండి.

ప్రియాంక గాంధీ గారి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలపై బిజెపి కేంద్ర నాయకత్వం దేశానికి క్షమాపణ చెప్పాలి.

దేశ సంస్కృతిని దిగజార్చే పరిస్థితి తెచ్చినందుకు
బిజెపి నాయకులు సిగ్గుపడాలి.

దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరా, రాజీవ్ గాంధీ కుటుంబ సభ్యురాలు ప్రియాంక గాంధీ పై బిజెపి నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను దేశం పైన ప్రేమ, అభిమానం, స్త్రీల పైన గౌరవం ఉన్నవారు జీర్ణించుకోలేకపోతున్నారు

ప్రియాంక గాంధీ గారి పట్ల బీజేపీ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను రెండు రోజులుగా కేంద్ర నాయకత్వం ఖండించకపోవడం విచారకరం.

ప్రియాంక గాంధీ పై బిజెపి నాయకుడు చేసిన వ్యాఖ్యలను జీర్ణించుకోలేక తాత్కాలిక ఆవేశంతో కొంతమంది యువజన కాంగ్రెస్ నాయకులు బిజెపి కార్యాలయం పైన దాడి చేయడాన్ని ఖండిస్తున్నాను. ఈ ఘటనను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు.

రాజకీయ పార్టీల కార్యాలయం పై దాడులు చేయడం గాంధీ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు.

అహింసా,  గాంధేయ మార్గంలో ఎదుటివారి తప్పులను ఎత్తిచూపుతో ప్రజాస్వామ్యంగా ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టడమే తప్ప భౌతిక దాడులను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎప్పుడు ప్రోత్సహించదు

భారత రాజ్యాంగం కల్పించిన భావ స్వేచ్ఛ హక్కును వినియోగించుకొని తమ భావాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడాన్ని ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలకు ఏ పార్టీ కూడా పాల్ఫొడొద్దు.

గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గారిపై మాజీ ఎంపీ, బిజెపి నాయకులు రమేష్ బిదోరి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించకుండా బిజెపి నాయకత్వం కండ్లు మూసుకొని నిద్ర పోతుందా? రెండు రోజులు అవుతున్న ఎందుకు ఖండించలేదు?

బిజెపి కేంద్ర నాయకత్వం ఇప్పటికే స్పందించి రమేష్ బిదోరిని సస్పెండ్ చేసి ఉండాల్సింది.  కనీసం స్పందించ లేదు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని ప్రోత్సహించేలా బిజెపి కేంద్ర నాయకత్వం గాలికి వదిలేయడం తగదు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !