రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 7:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గోల్పర్తి గ్రామంలో ఎర్రం నాగులు తండ్రి భూమయ్య కు 30 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం రోజు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుపేదలకు బాధిత కుటుంబాలకు చేయూత నిస్తూ వారికి అండగా ఉంటూ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో గోల్పర్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రం సత్యం,ఎర్రం యాదగిరి,పాత నరేష్,రొయ్యల స్వామి,పచ్చంటి రాము గ్రామ యూత్ కాంగ్రెస్ నాయకులు సాదుల కనకరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 142









