◆అతివేగంతో ప్రయాణించకండి ప్రమాదాల బారిన పడకండి ఎస్సై రాజమౌళి
నేటి గద్దర్ న్యూస్ గుండాల:ఏమరపాటు ప్రయాణం ప్రమాదాలకు మూలమని గుండాల ఎస్ఐ రాజమౌళి అన్నారు. కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల అనుసారం గుండాల సీఐ రవీందర్ సూచనతో మండల కేంద్రంలో రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అతివేగంతో ప్రయాణించకండి ప్రమాదాల బారిన పడకండి అని అన్నారు. మద్యం తాగి వాహనాలను నడపరాదని అన్నారు. అతివేగంతో వాహనాలు నడిపిన మద్యం తాగి వాహనాలు నడిపిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మైనర్ పిల్లలు వాహనాలు నడిపి ప్రమాదాలు జరిగితే వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Post Views: 36