*ఖమ్మం : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి వ్యక్తిగత ఛాయ చిత్రగ్రాహకుడిగా పనిచేస్తున్న చందుకి జాతీయ స్థాయి ఘనత దక్కింది. జనవరి 5,6వ తేదీలలో హుస్సేన్ ఖాన్ ఆధ్వర్యంలో ఒడిస్సా రాష్ట్రంలో సెవెంత్ నేషనల్ వర్క్షాప్ పేరుతో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో కన్సొలేషన్ విభాగంలో ప్రథమ బహుమతి లభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహరాష్ట్ర, ఒడిస్సా సహా పలు రాష్ట్రాలకు చెందిన 120 మందికి పైగా దిగ్గజ ఫొటోగ్రాఫర్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. గిరిజన జాతిలోని బొండాస్ అనే ఓ తెగకు సంబంధించిన వారి సాంప్రదాయ వేషధారణ, నృత్యాలు, జీవన శైలి విధానాలపై ఈ వర్క్ షాపు జరిగింది. ఇందులో దిగ్గజ ఫొటోగ్రాఫర్లతో పోటీపడిన చందుకి కన్సొలేషన్ విభాగంలో బహుమతి లభించడం విశేషం. చందుకి జాతీయ స్థాయిలో బహుమతి రావడం పట్ల జిల్లాకు చెందిన ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు.
