+91 95819 05907

చిన్నారులు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి… విశిష్ట ఫౌండేషన్

నేటి గదర్ న్యూస్ జనవరి 08: వైరా ప్రతినిధి

వైరా :చిన్ననాటి నుండే విద్యార్థిని విద్యార్థులు కష్టపడే గుణాన్ని ఇతరులకు సహాయం చేసే సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలని జీవి మాల్ వారి విశిష్ట ఫౌండేషన్ కోఆర్డినేటర్ లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ పెనుగొండ ఉపేంద్రరావు అన్నారు. మండలం లోని గన్నవరం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చావా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యార్థిని,విద్యార్థులకు విశిష్ట ఫౌండేషన్ వారి సహకారంతో 30000/- రూపాయల విలువచేసే ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, విద్యార్థులు తీసుకునే ఆలోచనతో పాటుగా ఇతరుల అవసరాలకు ఉపయోగపడే విధంగా కూడా తయారవ్వాలని తద్వారా భవిష్యత్తుకు సమాజానికి ఉపయోగపడిన వారు అవుతారని ఆయన అన్నారు ప్రధానోపాధ్యాయులు చావ శ్రీనివాసరావు మాట్లాడుతూ దుస్తులు ఇప్పించడంలో ప్రత్యేక చొరవ తీసుకొని కృషిచేసిన పాఠశాల ఉపాధ్యాయులు పాలపర్తి భాస్కర్ ను అభినందిస్తూ విద్యార్థిని విద్యార్థులు తల్లితండ్రుల యొక్క శ్రమను గుర్తించి వారికి సహాయ పడటంతో పాటుగా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలని లక్ష్యాలను నిర్దేశించుకుని లక్ష్యాలను చేరుకోవాలని తెలియజేసినారు. ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కృష్ణవేణి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో సేవా గుణం కనబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య ప్రధాన కార్యదర్శి కొల్లా రాంబాబు, వైరా లయన్స్ క్లబ్ జిఎస్టి కోఆర్డినేటర్ తాడికొండ రాము, పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కృష్ణవేణి, పాఠశాల ఉపాధ్యాయులు డి. రాంబాబు, పాలపర్తి భాస్కర్ చారు గుండ్ల కరుణాకర్. A.కళావతి ఎం.డి రఫీ, విజయ్ కుమార్ sd.ఆసిఫ్ పాషా,p. జయ కుమార్, ఉపాధ్యాయుల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొని విశిష్ట ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసినారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !