చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
చర్లలోని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయం కు ప్రభుత్వ ఉపాద్యాయులు బందా రమేష్ – స్వరూప రాణి దంపతులు రూ. 5 వేల విలువ చేసే మిక్సీ అందచేసారు. బుధవారం విద్యార్ది నిలయంలో జరిగిన కార్యక్రమంలో రమేష్ దంపతులు నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి కు అందచేసారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఇక్కడి విద్యార్దులు క్రమ శిక్షణకు మారుపేరని ప్రశంసించారు. మారుమూల గ్రామాల నుండి వచ్చి ఇక్కడ విద్యాబుద్ధులు నేర్చుకోవడం గర్వకారణమని అన్నారు. విద్యపై దృష్టి సారించి ఉన్నత స్దితికి చేరుకోవాలని అన్నారు. చదువుతోనే భవిష్యత్ ఉంటుందని, ప్రతి ఒక్కరూ కష్టించి చదవి తల్లితండ్రుల కళలను సాకారం చేయాలని అన్నారు. కార్యక్రమంలో వనవాసీ ప్రాంత మహిళా సహ ప్రముఖ్ పెద్దాడ ఆశాలత, ప్రఛండ ప్రముఖ్ గొంది శోభన్‌బాబు, ఉపాద్యక్షులు జవ్వాది మురళీకృష్ణ, సహాయ కార్యదర్శి గోగికార్ రాంలక్ష్మణ్, సభ్యురాలు శ్రీదేవి పాల్గొన్నారు.









