నేటి గదర్ డెస్క్: సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జిల్లా కార్యదర్శి కాసాని ఐలయ్య గుండెపోటుతో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. మృతుని స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగరం సుజాతనగర్ లో ఆదివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన అంతిమయాత్రలో సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు,అనుబంధ సంఘాల నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని అంతిమ యాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Post Views: 50