◆.ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్.
నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
దశాబ్ద కాలం అధికారంలో ఉండి ఏ ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వని గత ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకులు ఇవాళ గ్రామ సభలలో ప్రజలను రెచ్చగొడుతున్నారు.ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందే విధంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది.
దయచేసి అన్ని గ్రామాల ప్రజలు గ్రామ సభలలో అధికారులు చెప్పే విషయాలను పాటిస్తూ అధికారుల సలహాలు సూచనలు తీసుకోవాలి.
ఆరు గ్యారెంటీలతో ప్రజల కలను నెరవేర్చనున్న ప్రజా ప్రభుత్వం.
కొంత మంది బిఆర్ఎస్ నాయకులు గ్రామసభలలో ప్రజలను రెచ్చగొట్టి అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు.
గ్రామ సభలో లేని ఎజెండాలను లేవనెత్తి ప్రజలని అయోమయానికి గురి చేసి గొడవలకు దారి తీస్తున్నారు. అటువంటి వారికి ఖబర్దార్. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.
పది సంవత్సరాలు అధికారంలో ఉండి నియోజకవర్గలలో ఏ ఒక్కరికి కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదు. అలాంటి మీరు అధికారం కోల్పోయాక ప్రజల కష్టాల గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసము అనేది ప్రజలు గుర్తుచేసుకోవాలి. అమాయక ప్రజలను రెచ్చగొట్టి గ్రామ సభలలో వచ్చే అధికారులను ఇబ్బంది పెట్టి పేద కుటుంబాలకు అన్యాయం చేసే దిశగా ఈ రోజు బిఆర్ఎస్ చేస్తుంది. దయచేసి అన్ని గ్రామాల ప్రజలు గమనించి మీరు ఏ ఏ పథకాలకు అర్హులైనవారో ఆ పథకాలు పొందగలరు. గ్రామ సభలో ఎన్ని ఎజెండాలు ఉన్నాయో అధికారులు క్లుప్తంగా మీకు వివరిస్తారు. మీకున్న సందేహాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోగలరు.ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామిని అమలు చేస్తుండడం తో బి ఆర్ ఎస్ నేతలకు కడుపు మంటగా ఉంటుందని అందుకే చిల్లర వేషాలు వేస్తున్నారని సురేష్ నాయక్ ధ్వజమెత్తారు.
