నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అక్క చీటి సకలమ్మ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఎంపీ రవిచంద్ర ఆమె మృతి వార్త తెలిసిన వెంటనే రాజ్యసభలో తన సహచర సభ్యులు దీవకొండ దామోదర్ రావుతో కలిసి మేడ్చల్ మండలం మునీరాబాద్ సుభిషి ఫారెస్ట్ ఏడ్జ్ విల్లాస్ వెళ్లి సకలమ్మ పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.సకలమ్మ కుమారులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను ఎంపీలు రవిచంద్ర, దామోదర్ రావులు పరామర్శించారు,తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితర ప్రముఖులతో కలిసి రవిచంద్ర, దామోదర్ రావులు ఆమె అంతిమయాత్రలో పాల్గొని, అంత్యక్రియలకు హాజరై సకలమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
