రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ శివారులో గల సదాశివనగర్ తాండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.స్థానికులు తెలిపిన వివరాల మేరకు అక్కన్నపేట గ్రామానికి చెందిన ప్రశాంత్,బాబు పనిమీద మెదక్ వైపు వెళ్తు అక్కన్నపేట గ్రామ శివారు రోడ్డు మూలమలుపు సదాశివనగర్ తాండ వద్ద బైకు అదుపు తప్పి అటవీ శాఖ బోర్డును ఢీ కొనడంతో ఇద్దరి యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.అటువైపు వెళుతున్న వాహనదారులు.108 సిబ్బంది సమాచారం అందించారు.వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకొని క్షత గాత్రులను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు.
Post Views: 32