జాతీయ మాల మహానాడు జిల్లా కన్వీనర్… తోటమల్ల రమణమూర్తి
చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
పేద ప్రజల అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం కొట్లాడిన మహానుభావుడు ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ అని జాతీయ మాల మహానాడు జిల్లా కన్వీనర్ తోటమల్ల రమణమూర్తి, జిల్లా కో- కన్వీనర్ ఏడెల్లి గణపతి, సీనియర్ నాయకులు తడికల లాలయ్య, కొంగూరు రమణారావు అన్నారు.ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకులు గద్దర్ 77వ జయంతిని పురస్కరించుకొని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, జిల్లా ఇన్ ఛార్జ్ అసోద భాస్కర్ ఆదేశాల మేరకు చర్ల మండల కమిటీ అధ్యక్షులు తోటమల్ల గోపాలరావు అధ్యక్షతన మండల కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా కన్వీనర్ తోటమల్ల రమణమూర్తి, కో కన్వీనర్ ఏడెల్లి గణపతి ముందుగా గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారు సీనియర్ నాయకులు తడికల లాలయ్య, కొంగూరు రమణారావులతో కలిసి సమావేశంలో మాట్లాడుతూ గద్దర్ తన ఆటపాటలతో లక్షలాది మందిని మేల్కొల్పిన గొప్ప గాయకుడు అని ప్రశంసించారు.సామాన్యులకు అర్థమయ్యే రీతిలో పాటలు రాసి,పాడి ప్రజలను ఉత్తేజ పరిచే వారిని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు.తెలంగాణ సాంస్కృతిక సమాజానికి ఆయన విశేషమైన సేవలు అందించారని అన్నారు.అణగారిన వర్గాల కోసం కొట్లాడిన మహానుభావుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా అధ్యక్షులు బోళ్ల వినోద్, నాయకులు కారంపూడి సాల్మన్, తోట మల్ల కృష్ణారావు, మోత్కూరి ప్రభాకర్, కొంగూరు సత్యనారాయణ,తోటమల్ల వరప్రసాద్, తోటమల్ల రవికుమార్, కర్రీ సంతోష్, నిట్ట దివాకర్, పాముల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.