రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో శనివారం నాడు బిఆర్ఎస్ పార్టీ పట్టణ ముఖ్య నాయకులు గజవాడ నాగరాజు, సరాపు యాదగిరి లు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం పాఠకులకు విధితమే.కాగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు దూలపల్లి స్వగృహంలో అయన సమక్షంలో నేడు రామాయంపేట పట్టణానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాపు యాదగిరితో సహా మాజీ ఉపసర్పంచ్ నాగేశ్వర్ రెడ్డి,చింతల యాదగిరి,మధునాల స్వామి గౌడ్,యాద నాగరాజు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోనాల శ్రీను,తాపీ మేస్త్రి సంఘం అధ్యక్షులు మర్కు చంద్రంలను కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.