కేంద్ర బడ్జెట్ భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తుంది
-బిజెపి జిల్లా అధ్యక్షులు కే వి రంగా కిరణ్
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 3 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తుందని, భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కె వి రంగా కిరణ్ అన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర వార్షిక బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేస్తూ అశ్వారావుపేట మండల కేంద్రంలో సోమవారం బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు బండారు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం కి ముఖ్యఅతిథిగా భద్రాద్రి జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు కె వి రంగా కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ దేశాభివృద్ధిని ప్రోత్సహించే ప్రజారంజక బడ్జెట్ అని హర్షం వ్యక్తం చేశారు. సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారన్నారు. వ్యక్తిగత ఆదాయ పన్ను 12 లక్షలకు మినహాయింపు ఇవ్వడం శుభ పరిణామం అన్నారు. ప్రజానుకూల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గం కన్వీనర్ గుట్టుపూల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి జల్లీపల్లి అరవింద్, మద్దాల దేవి, సోలాస పుష్కర్, చిట్టి శ్రవణ్, కలకోటి కృష్ణ, సీమకుర్తి సుబ్బరావు, మాటూరి విజయ్, శ్యాం, వినోద్ తదితరులు పాల్గొన్నారు.