నేటి గదర్ వెబ్ డెస్క్: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్న ఓ వ్యక్తికి ముద్దు పెట్టి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులలో ఆత్మస్థైర్యం నింపాడు. హైదరాబాద్ లోని స్పర్శ హౌస్ పీస్ పాలిటివ్ కేర్ సెంటర్ ని సందర్శించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులతో ముచ్చటించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు.క్యాన్సర్‌తో ఎవరూ ఒంటరిగా పోరాడరు. దీనికి బలం, ప్రేమ శ్రద్ధ వహించే సమాజం అవసరం
అని సూచించారు.పాలియేటివ్ కేర్ రోగులకు మరియు వారి కుటుంబాలకు ఓదార్పు, గౌరవం మరియు శాంతిని తెస్తుంది. నేను ఈ కార్యక్రమానికి నేను చేయగలిగిన ప్రతి విధంగా మద్దతు ఇస్తూనే ఉంటాను . మరింత మంది ముందుకు వచ్చి మార్పు తీసుకురావాలని కోరుతున్నాను అని అన్నారు.
Post Views: 134