*వరంగల్ జిల్లా*
*07 ఫిబ్రవరి 2025*
ఎం.జి.ఎం. హాస్పిటల్ ,(పీ.పీ. యూనిట్) అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ లో నులి పురుగుల నివారణ పై అంగన్వాడి టీచర్లకు మరియు ఆశ కార్యకర్తలకు మీటింగ్ నిర్వహించి శిక్షణ ఇచ్చిన వైద్యాధికారిని డాక్టర్ మేరుగు.యశస్విని. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమము 10 ఫిబ్రవరి 2025 మరియు మా అప్ డే 17 ఫిబ్రవరి 2025 న నిర్వహించనున్నట్లు తెలిపినారు .దీనికి సంబంధించిన మైక్రో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగినది. పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ సెంటర్లలో విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు, తద్వారా ఆల్బెండజోల్ 400mg మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపినారు.. ఒక సంవత్సరము నుండి రెండు సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు సగం టాబ్లెట్ చూర్ణం చేసి నీళ్లలో వేసి త్రాగించాలని, 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల పిల్లలకు పూర్తి టాబ్లెట్ చూర్ణం చేసి ఇవ్వాలి.3 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు పిల్లలకు పూర్తి ట్యాబ్లెట్ నమిలి మింగాలని కోరినారు. పిల్లలలో నులి పురుగులు శరీరంలో ఉండడం వలన వారి శారీరక, మానసిక అభివృద్ధి జరగకపోవడం, నీరసంగా, రక్తహీనతతో చదువుపై శ్రద్ధ లేకపోవడం మొదలగు లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, ప్రజలలో అవగాహన కల్పించారు జాతీయ నులిపురుగుల కార్యక్రమమును విజయవంతం చేయాలని వైద్యాధికారి డాక్టర్ యశస్విని కోరినారు.. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నర్మద, రామ రాజేష్ ఖన్నా, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.