నేటి గదర్ న్యూస్ :వైరా ప్రతి నిధి
వైరా:- మండల పరిధిలోని పాలడుగు గ్రామంలో తరతరాలుగా డాక్టర్ కేశగాని రాజశేఖర్ గౌడ్ కుటుంబం పెద్దగౌడ్ గా ఉంటూ గౌడ కుటుంబాలన్నీ ఒకటిగా ఉండాలన్న ఉద్దేశంతో శుక్రవారం గ్రామంలో గౌడ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి గ్రామంలో సభ్యత్వ గౌడ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంరాష్ట్రంలో ఉన్న గౌడ కుటుంబాలకు రావలసిన రాయితీలు వెంటనే కోరారు. పాలడుగులో ప్రారంభమైన సభ్యత్వ నమోదు జిల్లాలో ఉన్న గౌడ కులస్తులందరూ సభ్యత్వం కలిగి ఉండాలన్నారు.ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎక్సైజ్ ఆఫీసర్స్ మేడిపల్లి సాయిరాం,నల్లాల రతన్ ప్రసాద్ లు హాజరై హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దలు కోసూరిపెద్ద వెంకయ్య,చిన్న వెంకయ్య, పొట్టపల్లి శ్రీనివాసరావు,కేశ గాని నరసింహారావు,కేశగాని చంద్రశేఖర్,కోసూరు కృష్ణ,కోసూరి గోపాలకృష్ణ,కోసూరి రామకృష్ణ కోసూరి వెంకటరమణ, వడ్డెబోయిన శ్రీను,వడ్డే బోయిన ప్రసాద్,తోట ప్రభాకర్ తోట చలపతి,కేసగాని వెంకటేశ్వరరావు,కేశగాని వెంకన్న,కేశగాని సురేష్,కేశగాని నరేష్, పొట్లపల్లి చిన్న ఆగయ్య, పొట్లపల్లి గోవిందరావు, కోసూరు చిన్న కృష్ణ,కోసూరి సాయి లు పాల్గొన్నారు.