రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) ఫిబ్రవరి 8:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయలపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన మేదరి సిద్ధ రాములు తల్లి మరణించడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే స్పందించి గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీ తరపున ఆ బాధిత కుటుంబానికి శనివారం నాడు 10000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గ్రామంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు ఏ ఆపద వచ్చిన గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున ఎల్లప్పుడు తాము అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 42