రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) ఫిబ్రవరి 8:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో నేడు ఆదివారం నాడు 33/11 కెవి సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా విద్యుత్ కు అంతరాయం కలుగుతుందని రామాయంపేట ట్రాన్స్ కో ఏఈ తిరుపతిరెడ్డి తెలిపారు.అందుకోసం రామాయంపేట పట్టణంతో పాటు కోమటిపల్లి,గోల్పర్తి, దామర చెరువు,వెంకటాపూర్,అక్కన్నపేట గ్రామాల ప్రజలకు వ్యవసాయదారుల బోరు మోటార్లకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు విద్యుత్ కు అంతరాయం కలుగుతుందన్నారు.దీనికి సబ్ స్టేషన్ పరిధిలో రామాయంపేట పట్టణంతో పాటు వివిధ గ్రామాల ప్రజలు రైతులు పూర్తిస్థాయిలో విద్యుత్ అధికారులకు సహకరించాలని ఆయన తెలియపరచారు.
Post Views: 131