*ఏడు గ్రామ పంచాయతీల ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా అధ్యక్షులు రేగా*
నేటి గదర్ కరకగూడెం:ఎన్నికలు,ఎదైన ఎప్పుడూ వచ్చి గెలుపె లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సిద్దంగా ఉండాలని పినపాక మాజీ శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. అనంతారం గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన ఏడు గ్రామ పంచాయతీల ముఖ్య కార్యకర్తలు,నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు తో గద్దెనెక్కి 13మాసలు(నెలలు)నిండిన ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నేటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అన్నారు. 6 గ్యారంటీ ల పేరుతో ప్రజలను అనేక అవస్థలు పెడుతున్నారని, రుణమాఫీ రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, దళిత బంధు, పథకాలను అటుకెక్కించి దోపిడి చేస్తున్నారని ఆయన అన్నారు. 420 రోజుల్లోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని దానిని కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని ఏ ఎలక్షన్ వచ్చినా కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలలో అవగాహన కల్పించి రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దివాలా కోరు పార్టీ అని ప్రజలను దివాలా తీయించడం తప్ప అభివృద్ధి చేయడం చేతకాదని ఆయన అన్నారు. కార్యకర్తలు సైనికుల పనిచేసే గులాబీ జెండాను రెపరెపలాడించాలని గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజల్లోకి గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలియజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను ప్రజలకు చూపించాలని ఆయన అన్నారు. దేవుళ్ళ మీద ఓట్లు వేసి హామీలు ఇచ్చారు హామీలు పూర్తిగా మర్చిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రజల పక్షాన నిలిచే ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రావుల సోమయ్య,మాజీ సర్పంచ్ ఊకే రామనాథం, విశ్వనాథం సీనియర్ నాయకులు కొమరం రాంబాబు, నాగేశ్వరరావు, మాజీ సర్పంచులు,సీనియర్ నాయకులు అత్తె నాగేశ్వరరావు, పసునురి అంజయ్య,కొమ్మ సత్యనారాయణ, పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
