సైన్స్ పరిజ్ఞానంలో (ఎత్నో-బోటనీ) బోటనీ సస్నేబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ఈ ఘనత..
నేటి గదర్ ప్రతి నిధి
తల్లాడ :మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి గొల్లమందల రవికి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ డాక్టర్ కే.నాగ జ్యోతి చేతులమీదుగా డాక్టరేట్ బహుమతిని ప్రధానం చేసింది.(ఎత్నో-బోటనీ) బోటనీ సస్నేబుల్ డెవలప్మెంట్ గోల్స్ మరియు గ్లోబల్ బయోడేవర్సిటీ ఫ్రేమ్ వర్క్ తో అనుసంధానం తెలంగాణ మరియు భారత్ అనే పీహెచ్డీ పరిశోధనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వృక్ష సంపద వాటి పరిరక్షణ అవసరాలు మరియు ఆదివాసీలకు ఉపయోగించే వివిధ రకాలైన మందు మొక్కలపై పరిశోధనకు గాను పీహెచ్డీ చేయగా 2020 నుండి 2025 వరకు సాగిన ఈ విస్తృత అధ్యయనంలో1131 వృక్షజాతులు గుర్తించబడ్డాయి వీటిలో 12 ఉప జాతులు మరియు 13 వేరియేట్లు ఉన్నాయి అని కనిపెట్టి వాటిని అధ్యయనం చేసే ఇవి 626 ప్రజాతులు 137 కుటుంబాలకు చెందినవిగా ఆయన తెలియజేశారు ఈ పరిశోధన ద్వారా తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా తర్వాత రెండో అత్యధికమైన వృక్ష సంపద కలిగిన జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుర్తించబడింది అని అలాగే డాక్టరేట్ సాధించడంలో నాకెంతో సహకరించిన డాక్టర్ డి. వీరాంజనేయులు మరియు అసల్ల అప్పయ్య. ఈ సందర్భంగా బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ యాజమాన్యం ఛాన్స్లర్ భరత్లాల్ మీనా, డాక్టర్ రూప వాసుదేవన్ ప్రో- వైస్ ఛాన్స్లర్ డాక్టర్ నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు.