హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి ఫిబ్రవరి 09.
మెదక్ జిల్లా హవేలి ఘణపూర్ మండలం వాడి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ పార్వతి సిద్ధి రామేశ్వర స్వామి వారి దేవాలయ నవమ వార్షికోత్సవ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ని గ్రామ నాయకులు సాదరంగా ఆహ్వానించి,ఆలయ ప్రాంగణంలో వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు,అనంతరం ఎమ్మెల్సీ కి వేద పండితులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి గ్రామస్తులు ఎమ్మెల్సీ కి శాలువతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రేడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలు అందరూ పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరారు,అనంతరం శ్రీ శ్రీ శ్రీ మాధవానంద స్వామి ని ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు, ప్రత్యేక పూజలు నిర్వహించిన మాదవనంద స్వామి భక్తులను ఉద్దేశించి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడుచుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంట ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి,నర్సింలు,రాజు, బిక్షపతి,మల్లయ్య,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోపాల్ రావు,తాజా మాజీ సర్పంచులు యామిరెడ్డి,మహిపాల్ రెడ్డి, శ్రీను నాయక్,సాయ గౌడ్ మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.