+91 95819 05907

*శ్రీ చిరుమళ్ళ సమ్మక్క సారలమ్మ జాతర భక్తులకు ఆహ్వానం:*శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవ నిర్వహణ కమిటీ* *శ్రీ చందా లింగయ్య దొర* MA, M phil. మాజీ శాసనసభ్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ (ఖమ్మం)

నేటి గదర్ న్యూస్, కరకగూడెం:

*భక్తులారా :-* ఆదివాసి ఇలవేల్పులు, పూజారులు, తలపతులు, వడ్డెలు, బోయిలు, అడితి బిడ్డలు, ఆదివాసి పెద్దలు, ఆదివాసి సంఘాలు, భక్తులకు, సర్వజనులకు ఇదే మా ఆహ్వానం
🙏🙏🙏

ఆదివాసి మహిళా పరాశక్తి అయిన *శ్రీ సమ్మక్క శ్రీ పగిడిద్దరాజు* గార్ల కళ్యాణం (వివాహం)
తేది : 13/02/2025 గురువారం రాత్రి 12:30 నిమిషములకు జరుగును ఆరోజు నిండు జాతర
శ్రీ సమ్మక్క తల్లిని చిరిమల్ల దండకారణ్యంలో ఉన్న ముసలమ్మ (చిలకల) గుట్ట నుండి అంగరంగ వైభవాలతో వనదేవతలను కలుపుకొని ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలతో…
కళాబృంద నృత్యాలతో…
దేవతల పూనకాల కోలాహలములతో…
చిరుమళ్ళ గ్రామంలోని *శ్రీ సమ్మక్క – సారలమ్మ తల్లుల గద్దెల* మీదికి తీసుకొనివస్తారు…

అంతకు ముందు రోజు అనగా తేదీ : 12/02/ 2025 (బుధవారం) రోజు రాత్రికే శ్రీ సమ్మక్క శ్రీ పగిడిద్దరాజు గార్ల కళ్యాణం కోసం సర్వదేవతలు, ఇలవేల్పులు శ్రీ సమ్మక్క పగిడిద్దరాజు వేల్పులు చిరిమల్ల గ్రామం చేరి గద్దెల దగ్గర వున్న కళ్యాణ మండపం వద్ద ఆశీనులై ఉంటారు…

శ్రీ సమ్మక్క తల్లి శ్రీ చంద వారి వంశంలో…
ఆనాటి కాకతీయుల కాలంలో జన్మించినది
పగిడిద్ద రాజుతో పెళ్లి (కళ్యాణం) జరిగిన తర్వాత శ్రీ సమ్మక్క తల్లికి ఒకే ఒక్క కూతురు శ్రీ సారలమ్మ (సారక్క) జన్మించినది తల్లి కూతురు కలిసి చిరరుమళ్ల గ్రామం నుండి బయక్క పేట గ్రామం నకు కొంతమంది చంద వంశీయులతో కలిసి వెళ్ళినారు…

ఆ తరువాత మేడారం గ్రామం వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకొని స్థిరపడినారు మేడారం గ్రామం నుండి *శ్రీ సమ్మక్క సారలమ్మలు* భక్తులకు, సర్వజనులకు ఆశీస్సులు అందజేయుచున్నారు…
శ్రీ సమ్మక్క తల్లి సూచనల ప్రకారం ఒక్క సంవత్సరం చిరుమల్ల గ్రామంలో ఉన్న చందా వంశీయులు మరొక సంవత్సరం బయక్క పేటలో (మేడారం) లో ఉన్న చందా వంశీయులు తన కళ్యాణం *మాఘ పౌర్ణమి* నాడు జాతర ఉత్సవాలు జరుపు కొమ్మని చెప్పినందున ప్రతి రెండు సంవత్సరములకు ఒకసారి
చిరుమల్ల గ్రామంలో…
మేడారం గ్రామంలో… జరుపుకొనుట జరుగుచున్నది

కన్నుల పండుగగా జరిగే *శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవములో* తామెల్లరు పాల్గొని 13/02/2025 గురువారం జరిగే శ్రీ సమ్మక్క పగిడిద్దరాజు కళ్యాణం తిలకించి ఆ మహాపరాశక్తి గారి ఆశీస్సులు పొంది పరమానందాలతో, సుఖ సంతోషాలతో ఉండగలరని మనవి
🙏🙏🙏🙏🙏

*జాతర కార్యక్రమములు*

👉11/02/2025 (మంగళవారం) కుంకుమ పూజలు, గుడి మెలుగుట.

👉12/02/2025 (బుధవారం) ఎదిర గ్రామం నుండి పగిడిద్దరాజు, సార్లమ్మ, లక్ష్మీదేవితో పాటు ఆదివాసి ఇల వేల్పులు వచ్చును.

👉13/02/2025 (గురువారం) దండకారణ్యం నుండి చిరుమళ్ళ ముసలమ్మ (చిలకల) గుట్ట నుండి శ్రీ సమ్మక్క తల్లిని వనదేవతలను గద్దమీదికి తీసుకొని వచ్చి శ్రీ సమ్మక్క కళ్యాణం జరిపించుట.

👉 14/02/2025 (శుక్రవారం) శుంకు పండుగ, మొక్కులు చెల్లించుకొనుట.

👉 15/02/2025 (శనివారం) చిరుమళ్ళ గ్రామం నుండి శ్రీ సమ్మక్క తల్లిని ముసలమ్మ (చిలకల) గుట్టకు పంపించుట.

🙏🙏🙏🙏🙏

*మీ భవదీయులు*

*శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవ నిర్వహణ కమిటీ*

*శ్రీ చందా లింగయ్య దొర* MA, M phil.
మాజీ శాసనసభ్యులు,
మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ (ఖమ్మం)
*శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు*
చిరుమల్ల గ్రామం,
కరకగూడెం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !