నేటి గదర్ న్యూస్ ప్రతినిధి, హైదరాబాద్:
తమ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన బీఆర్ఎస్.ఇదివరకే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలంగాణ శాశన సభ కార్యదర్శి ని పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడంలో జాప్యం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విధితమే.ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన శాసనసభ కార్యదర్శి. దీనితో ఆ పదిమంది ఎమ్మెల్యేలలో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధమేనని ప్రకటించిన విషయం విధితమే. నేటి సుప్రీంకోర్టు తీర్పు పట్ల యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
Post Views: 141









