+91 95819 05907

ఇటీవల దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్. రంగరాజన్‌ను ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

ఇటీవల దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్. రంగరాజన్‌ను ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

వారితో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మరియు పార్టీ నాయకులు ఉన్నారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరులో రెండు రోజుల క్రితం కొందరు సీఎస్. రంగరాజన్ గారిపై దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ మండిపడ్డారు.

రాష్ట్రంలో పూర్తిగా క్షీణించిన శాంతిభద్రతల పరిస్థితికి ఈ దాడి సంఘటన నిలువెత్తు నిదర్శనమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాడి చేసిన వారు ఏ ముసుగులో ఉన్నా, ఏ ఎజెండాతో ఇలాంటి దారుణానికి ఒడిగట్టినా, వారిని ఉక్కుపాదంతో అణచివేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.

భగవంతుని సేవలో నిమగ్నమైన రంగరాజన్ కుటుంబ సభ్యులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

చిలుకూరు బాలాజీకి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఉన్నారని, స్వామివారి సేవలో నిమగ్నమైన కుటుంబాన్ని అవమానించడం అంటే అది దేవుడినే అవమానించినట్టేనని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

నిందితులందరినీ వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన కేటీఆర్, రంగరాజన్ కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రంగరాజన్ కుటుంబ సభ్యులకు తాము పూర్తిస్థాయిలో అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జీతాలు ఓ రోజు అటో ఇటో అయితే అర్థం చేసుకోండి :సీఎం రేవంత్ రెడ్డి

*తెలంగాణ రాష్ట్ర ఆదాయం ప్రతినెలా రూ.18 వేల కోట్లుగా ఉందని.. ఖర్చులు మాత్రం 22 వేల కోట్లుగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.* హైదరాబాద్ రవీంధ్రభారతిలో *కొలువుల పండుగలో భాగంగా జూనియర్ లెక్చరర్లకు నియామకపు

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బిఆర్ఎస్ నాయకులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన మంగలి భూమయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించాడు.భూమయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న మెదక్ నియోజకవర్గం బీఆర్ఎస్

Read More »

నస్కల్ వ్యక్తికి రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం అందజేత

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన గోశిక వెంకటేష్ ఉన్నత చదువులకు హర్యానా హిసార్ గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం నుండి బీటెక్

Read More »

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కొత్తగూడెం & కార్పొరేట్ ప్రాంతాలకు ప్యానల్ అడ్వకేట్‌గా వెల్లంకి వెంకటేశ్వరరావు నియామకం

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) దేశంలోని అతిపెద్ద కోల్ మైనింగ్ సంస్థల్లో ఒకటిగా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తోంది. వేలాది మంది కార్మికులకు ఉపాధి

Read More »

పినపాక మండలం తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షులుగా బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి నియామకం

పినపాక మండలం ఈ. బయ్యారం గ్రామానికి చెందిన తెలంగాణ జన సమితి పార్టీ మండల నాయకులు బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి గారిని పినపాక మండల నూతన తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షుడిగా

Read More »

 Don't Miss this News !