+91 95819 05907

టి యు సి ఐ జిల్లా మహాసభలు విజయవంతం చేయండి:ఆర్. మధుసూదన్ రెడ్డి,

టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి,

ఈనెల 16న కొత్తగూడెంలో జరిగే టి యు సి ఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి కార్మికులను కోరారు. సోమవారం పినపాక మండలం లో వివిధ గ్రామపంచాయతీల వర్కర్స్ ,కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ తో గ్రూప్ మీటింగ్స్, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు, మున్సిపాలిటీ కార్మికులు ఓకే రకమైన పని చేస్తున్నప్పటికీ మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం 15,600 వేతనాలు చెల్లిస్తూ, గ్రామపంచాయతీ కార్మికులకు 9,500 రూపాయలు చెల్లించడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, ప్రతినెల వేతనాలు చెల్లించాలన్నారు. వారికి చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు కల్పించాలన్నారు. కేజీబీవీ నాట్ టీచింగ్ వర్కర్స్ కు కూడా పనికి తగ్గ వేతనాలు అందడం లేదన్నారు. కేజీబీవీ నాట్ టీచింగ్ వర్కర్స్ వేతనాలు కూడా పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 16న కొత్తగూడెంలో జరిగే టియుసిఐ జిల్లా మహాసభ ను జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వెంకన్న, శ్రీను, మౌనిక ,లాలయ్య ,నరసయ్య, రామారావు, సుజాత ,విజయలక్ష్మి ,నాగమణి ,చిట్టెమ్మ, రమణ, నవిత, సునీత, బాలరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !