నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
పెండింగ్ లో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇప్పించాలి
ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షుడు సోందె మల్లు దొర అన్నారు. ITDA దర్బార్ నందు వివిధ పోడు రైతుల సమస్య లతో కూడిన వినతి పత్రం పిఓ కి అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షుడు సోందె మల్లుదొర మాట్లాడుతూ ఆదివాసి రైతుల పోడు భూములు సర్వే చేసి అర్ధాంతంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా నిలిపివేసి మేమో రూపంలో ఇచ్చి ఉన్నారని అట్టే పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములు పై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని ప్రభుత్వాలు పోడు భూములు ఆదివాసులు సాగు చేసుకోవడానికి హక్కులు కలిపించిన ఫారెస్ట్ అధికారుల బెదిరింపులు ఆగే తరుణం కనిపించట్లేదని ఇట్టి విషయంపై చర్యలు తీసుకోవాలని అన్నారు అదేవిధంగా పోడు భూముల విషయంలో వారసత్వ పట్టాలు ఇప్పించాలన్నారు మరియు నియోజకవర్గ వ్యాప్తంగా ఏజెన్సీ చట్టాలన తుంగలో తొక్కి నీరు గారుస్తున్న మండల అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి కోరం మురళి వీరభద్రం పాయం వీరయ్య రాముడు కాక నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
