రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) ఫిబ్రవరి 10:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయలాపూర్ గ్రామానికి చెందిన మ్యాదరి లక్ష్మమ్మ మరణించడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు గట్టు ప్రశాంత్ మృతురాలు కుటుంబాన్ని పరామర్శించి వారిని ఓదార్చి ఆ బాధిత కుటుంబానికి 4000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు.బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన గట్టు ప్రశాంత్ కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కొమీరె లాజర్, గట్టు రాజు,రమేష్ ,మహేందర్,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Post Views: 120