రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) ఫిబ్రవరి 10:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్ఐ.గౌసోద్దీన్ మాట్లాడుతూ ప్రజల సమస్యల కోసం ఉన్నతధికారుల ఆదేశాల మేరకే ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ వారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా భూ సమస్యలకు సంబంధించి ఒక దరఖాస్తు వచ్చిందని పేర్కొన్నారు.మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఏదైనా సమస్య ఉంటే నేరుగా ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేయవచ్చని వెల్లడించారు.ఈ అవకాశాన్ని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
Post Views: 62