★జస్టిస్ జైశ్వాల్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా బీర్ల ధరలపై 15 శాతం పెంచిన సర్కార్
*బీరు ప్రియులకు కాస్త చేదు వార్త…* రాష్ట్రంలో బీరు ధరలు 15 శాతం పెరిగాయి. *వచ్చేది ఎండాకాలం. చల్లగా రెండు బీర్లు తాగి సేద తీరదామనుకునే వారికి బీర్లు ప్రియం అయ్యాయి.* ధరల నిర్ణయ కమిటీ సిఫారసుల మేరకు పెంపునకు ప్రభుత్వం అనుమతించింది. పెరిగిన బీరు ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
*పెరిగిన బీరు ధరలు..* బీరు ధరలను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. జస్టిస్ జైశ్వాల్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా *బీర్ల ధరలపై 15 శాతం పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.* పెరిగిన రేట్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. 2019 నుంచి రాష్ట్రంలో బీర్ల ధరలు పెరగలేదు. ముడి పదార్ధాల రేట్లు పెరిగినా, అప్పటి ధరతోనే బ్రూవరీస్ కంపెనీలు సరఫరా చేస్తూ వచ్చాయి.
*బీరు విక్రయాల్లో 69 శాతం కింగ్‌ఫిషర్ వాటా…* బీరు విక్రయాల్లో 69 శాతం కింగ్‌ఫిషర్ వాటా ఉంది. సంక్రాంతికి ముందు తమకు ధర గిట్టుబాటు కావడం లేదంటూ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ బీరు సరఫరా ఆపేసింది. ముందస్తు సమాచారం లేకుండా బీర్ల సరఫరా నిలిపివేయడం రాష్ట్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ధరల నిర్ణాయకకమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సర్కార్ తెలిపింది. ఆ తర్వాత యూబీఎల్ కంపెనీ ప్రతినిధులు సంప్రదింపులు జరిపి సరఫరా పునరుద్ధరించారు. ఆ ఒప్పందం మేరకే తాజాగా బీరు ధరలు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.